"నాన్న .... లే నాన్న .... అమ్మ త్వరగా లేవమంతుంది. అంకుల్ వచ్చారు..." అని నా ఐదు ఏళ్ళ చంటి గాడి పిలుపు. చెవులకి చిన్నగా వినిపిస్తుంది. నిద్ర మత్తు ఇంకా వదిలినట్టు లేదు అంతా మసక మసకగా కనిపిస్తుంది. నీళ్ళు చల్లుకొని తయారయ్యే సరికి అర గంట పట్టింది. మెల్లా లో కి వెళ్ళి చూస్తే వీడు ఇంకా మారలేదు అన్నట్టు అరవింద్ గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. అది తప్పించుకోవటానికి T.V లో వార్తలు పెట్టా. మా చిన్నపుడు అయితే రోజు కి నాలుగు సార్లు మాత్రమే వచ్చేవి కానీ ఇప్పుడు సరదా చానల్స్ కంటే ఈ 24 గంటల వార్తా చానల్స్ ఎక్కువైపోయాయి. అబ్బా క్రికెట్ మైదానం లో సచిన్ కోసం ఎదురు చూసినట్టు ఈ అరవింద్ గాడు ఇంకా నన్నే చూస్తున్నాడు. రా రా తిని వెళ్దాం అంటే ఎం వద్దు బయట క్యాంటీన్ లో కానిదాం అని లాకేల్తున్నాడు. మా ఆవిడని చంటి గాడికి పెట్టి నువ్వు తినేయ్ అంటే కోపం గా చూసింది (పిల్లలు పుట్టిన తరువాత తనను పట్టించుకోవట్లేదు అని ఆడవాళ్ళకి ఉండే అభిప్రాయమే మా ఆవిడకి ఉంది).నేను, అరవింద్ కార్ లో బయల్దేరాం.
" ఏరా అరవింద్ కళ్లు ఏంటి అంత ఎర్రగా ఉన్నాయి..రాత్రి నిద్ర పోలేదా?" అని అడిగితే ముసి ముసిగా నవ్వుతూ " అవున్రా రాత్రంతా నిద్ర లేదు. ఈ రోజు కోసమే ఎదురు చూసి చూసి ఇలా ఎరుపెక్కాయి". " అయినా ఏముంది రా బాబు దీంట్లో. వాళ్ళకి పనీ పాటా లేక మనల్ని రమ్మన్నారు. ఈ వయసు లో మనం మళ్లీ వెళ్ళటం ఏంటి రా బాబు కర్మ కాకపోతే. దానికి తోడూ కంపెనీ వాళ్ళు కూడా ఓకే చెయ్యటం ఏంటి...వర్క్ ఫ్రొం హోం లాగా వర్క్ ఫ్రొం కాలేజీ అని ఇవ్వడం ఏంటి...నాకు ఇదంతా చిరాకుగా ఉంది. చిన్నపుడు మా నాన్న లేపే వాడు...ఇప్పుడు నేను నాన్న ని అయ్యాక మా చంటి గాడు లేపుతున్నాడు...". ఇవ్వన్ని వాడు వింటున్నాడు అనుకున్నా "ఏ రా తను వస్తుంది అనుకుంటున్నావా?" అని అడిగే సరికి నా మైండ్ బ్లాక్ఐంది. ఆ కధ జరిగిపోయి 15 ఏళ్ళు అవుతున్నా వీడింకా ఆలోచిస్తున్నాడు అంటే ఏమనాలో (ప్రేమా.. పిచ్చా...?) నాకర్ధం కాలేదు.
మా కాలేజీ వచ్చేసింది. కార్ ని షెడ్ లో పార్క్ చేశా. అరవింద్ గాడు అప్పటికే కొంత మంది పిల్లలతో మాటలు కలిపాడు. కాలేజీ ఇప్పుడెలా ఉందో, మాకు అప్పట్లో చెప్పినోల్లెవరైనా ఇప్పుడు ఉన్నారో లేరో ....అన్నీ వాకబు చేస్తున్నాడు. "ఆకలి రా... " అన్నట్టు చూసేసరికి పరిగెత్తుకుంటూ రొప్పుతూ పొట్ట ని ఊపుకున్తూ వచ్చాడు. వాడికి తెలిసిన విషయాలన్నీ చెబుతున్నాడు. ఏ మాట కా మాట మా కాలేజీ అప్పట్లో కంటే ఇప్పుడు చాల బాగుంది. మా university వాళ్ళ తప్పుకి మమల్ని బలి చేసారు అనుకున్నా మళ్లీ అందరం కలవ బోతున్నమనే ఆనందం వేసింది.ఇంత లో నా sub - oridinate (Team lead ) ఫోన్ చేసి తను చేసినదాన్ని ఒక సారి రివ్యూ చెయ్యమన్నాడు. నేను అక్కడ లేనందుకు మనసులో ఆనంద పడుతున్నాడని అర్ధం అవుతుంది. ఓకే అని ఫోన్ కట్ చేసి అరవింద్ గాడి కోసం చూస్తే వాడు కనపడలేదు. సరే క్లాసు కి వెళ్ళుంటాడు లే అనుకొని నోటీసు బోర్డు లో వెతికి వెళ్ళా. మా వాడు అందరి తో ముచ్చట్లు పెట్టేసాడు అప్పటికే. ఇంతలో మా ప్రిన్సిపాల్, hod వచ్చి మా ఆరు నెలల course structure చెప్పి వెళ్లారు. అక్కడ university లో ఎవరో తప్పు చెయ్యటం ఏంటి.. మా అందరి డిగ్రీస్ కెన్సెల్ చేసి మళ్లీ ఒక 6 నెలల కోర్సు పెట్టి ఇస్తామనడం ఏంటి ... మేమంతా మళ్లీ రావడం ఏంటి...ఈ అరవింద్ గాడు ఇంకా ఆ అమ్మాయ్ గురించి మాట్లాడటం ఏంటి అని మనసులో తిట్టుకున్నా. క్లాసు మొదలైంది. అందరు బుక్స్ తెచుకున్నట్టు laptops తెచ్చుకుని కూర్చున్నారు. అరవింద్ మాత్రం ఇంకా గుమ్మం వైపే చూస్తున్నాడు. ఆ అమ్మాయ్ ఇంకా రాలేదు అని అర్ధం అయింది నాకు.
అలా 2 periods ఐపోవస్తున్నాయి. ఇంత లో "May i come in" అనే సరికి అందరు అటు వైపు తిరిగి అటే చూస్తున్నారు. నేను మాత్రం అరవింద్ ని గమనిస్తున్నా. కళ్ళలో ఆనందం కనిపించింది. చిరంజీవి 150 సినిమా రిలీజ్ ఐనప్పుడు ఆనందించే ఫాన్స్ లా తయారయ్యాడు. ఇంటర్వల్ లో వెళ్ళి తనతో మాట్లాడమంటే తప్పదా అంటే కోడతాదేమో సరే అని వెళ్ళి మాట్లాడా. మాటల్లో మా వాడిని కూడా పిలిచా. అదే తడువు గా వచేసాడు. "ఏంటి అరవింద్ ఇలా ఐపోయావ్" అని తను ఆడిగేసరికి సిగ్గు పడుతూ డైట్ తప్పిందన్నాడు. ఇలా రోజులు గడిచి పోతున్నాయి. కానీ మా వాడికి తన గురించి ఇంకా పూర్తి గా తెలియలేదు. కానీ ఆ రోజు అనుకోని సంఘటన. తను ఫోన్ లో మాట్లాడి ఏడుస్తు మా దగ్గరకి వచ్చి తన భర్త కి ఆక్సిడెంట్ ఐంది హాస్పిటల్ కి తీసుకెళ్ళమని అడిగే సరికి పరుగు పరుగున వెళ్ళాం. నేను కార్ పార్క్ చేసోచే సరికి తను బయట కి మందుల కోసం వచ్చింది. మా వాడు ఏడి అని చూసే సరికి రక్తం ఇస్తున్నాడు. తన భర్త ది O -ve అరుదైనదయ్యేసరికి లేకపోవటం వళ్ళ అరవింద్ ఇస్తున్నాడు. అరవింద్ బయటకోచాక తను చెయ్యి పట్టుకొని కృతజ్ఞతలు చెప్పింది. వాళ్ళాయన కోలుకునే సరికి ఇంకో 2 రోజులు పట్టింది. "అరవింద్ తిన్నాడ? " అని వాళ్ళ భర్త అడిగే సరికి లేదు అని నేను అనే లోపు తను తిన్నాడు అనే సరికి నాకు ఆశ్చర్యం వేసి లేదు మేము బయట తింటాం అంటే వాళ్ళ అయ్యాన విచిత్రం గా చూసాడు వీళ్ళు ఎవరు అని. తను నన్ను పరిచయం చేసి బయటకి తీసుకొచ్చి అరవింద్ అంటే వాళ్ళ పిల్లోడు అని చెప్పే సరికి నేను అవ్వాకయ్య.
తనకి కూడా మా వాడంటే ఇష్టమే కానీ తనని గాడి లో పెట్టేందుకు ప్రేమించాట్లేదు అని అబ్బద్దమాడే సరికి అది పూడ్చుకోలేని అఘాదానికి దారి తీసింది అని చెప్పింది. ఇదంతా వింటే మా వాడు అనందిస్తాదని అనుకున్తూ మసిలే సరికి మంచం మీద నుంచి కిందపడ్డా. ఓ ఇదంతా కలా అని ఊపిరి పీల్చుకున్న. కానీ నడుము నొప్పి..మా ఆవిడ పాపం పరిగెత్తుకున్తూ వచ్చి pain killer రాసింది. చ ఇదంతా ఆ రాస్కెల్ అరవింద్ గాడివళ్ళ అని మనసులో తిట్టుకున్నా. నిన్న రాత్రి 3 గంటలు దీని మీద గోల చేసాడు. కొంత మంది గవర్నమెంట్ ఉద్యోగులకి t c లు తెచ్చుకోమని పంపింస్తే మనల్ని కూడా అలా పంపితే ఎంత బాగుంటుందో అని గొడవ చేస్తే పడుకోబెట్టాం.
అదండీ సంగతి!.
Dedicated to my sweet elephant...for encouraging me to open a blog...